రామ్చరణ్ 15.. అన్నీ స్పెషలే

రామ్చరణ్ శంకర్ల కాంబినేషన్లో సినిమా అంటేనే స్పెషల్. ఇక ఆ సినిమాలో అన్నీ స్పెషల్గా ప్లాన్ చేస్తే ఫ్యాన్స్ ఆనందం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించవచ్చు. అలాంటి సంతోషాన్ని కచ్చితంగా వారికి ఇవ్వబోతున్నాడట శంకర్. సాధారణంగా శంకర్ ఏం చేసినా అది ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుంది. ఆ విజనే తనని టాప్ డైరెక్టర్ని చేసింది. రామ్చరణ్ మూవీ విషయంలో కూడా ఆయన విజన్ ఫ్లాలెస్గా ఉందంటోంది టీమ్.

ఈ మూవీ మొదటి షెడ్యూల్ను నార్త్లో కంప్లీట్ చేసిన టీమ్.. రెండో షెడ్యూల్ను హైదరాబాద్లో ప్లాన్ చేసింది. ఓ ల్యావిష్ సెట్లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్బ్ సాంగ్ తీయడానికే పది రోజులు పడుతుందట. ఓ ల్యావిష్ సెట్లో చిత్రీకరించనున్న ఈ పాట కోసం ఎనభై మంది గ్రూప్ డ్యాన్సర్ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరెవరూ లోకల్ కాదు. అందరూ కూడా ఇంటర్నేషనల్ డ్యాన్సర్సే. రష్యా ఉక్రెయిన్ బ్రెజిల్ తదితర దేశాల నుంచి వచ్చారు. రామ్ చరణ్ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రిహార్సల్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో ప్రత్యక్షమవడంతో ఈ విషయం బైటికొచ్చింది.

ఆల్రెడీ ఓ ట్రైన్ ఎపిసోడ్ని పదికోట్లు పెట్టి హాలీవుడ్ రేంజ్లో తీయబోతున్నారనే వార్తలతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫ్యాన్స్.. ఇప్పుడీ సాంగ్ గురించి తెలిస్తే సంబర్ పడిపోవడం ఖాయం. ఇక మిగతా పాటలు దీన్ని మించి ఉంటాయట. వాటన్నింటినీ విదేశాల్లోనే తీయబోతున్నాడట శంకర్. సినిమా అంతా ఒకెత్తు శంకర్ పాటలు ఒకెత్తు అన్నట్టుంటాయి. ఎవరూ చూడని బ్యూటిఫుల్ లొకేషన్స్ని కనిపెట్టి మరీ అక్కడ తీస్తుంటాడు. ఈ మూవీ విషయంలోనూ అలాంటి విజువల్ ఫీస్ట్నే ప్లాన్ చేశాడట. అసలే చరణ్ మంచి డ్యాన్సరేమో.. పాటలు అదిరిపోతాయని చెప్పుకుంటున్నారు