పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ నేపథ్యంలో టీమ్ అంతా ప్రచారంలో బిజీ అయిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..యంగ్ టైగర్ ఎన్టీఆర్..దర్శక ధీరుడు రాజమౌళి అన్ని మెట్రో నగరాల్ని చుట్టేస్తున్నారు. దొరికిన ప్రతి వేదికను `ఆర్ ఆర్ ఆర్` ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమాని ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారో తెలిసిందే. తాజాగా అనుపమ్ చోప్రాతో జరిగిన ఫిల్మ్ కంపానియన్ చిట్ చాట్ లో చరణ్ పలు ఆసక్తిర విషయాలు చెప్పుకొచ్చారు.
బాక్సాఫీస్ వసూళ్ల వ్యవహారం అన్నివేళలా హాట్ టాపిక్ గా మారుతుంటుంది. దీని గురించి చరణ్ తెలివైన సమాధానాలు ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన రెండు.. మూడు రోజుల వరకూ అందులో నటించిన నటీనటులు..దర్శకుడి నైపణ్యం ఎలా ఉంటుంది..? అన్నది ఆసక్తికర చర్చకు దారి తీసింది.
మొదటి మూడు రోజుల పాటు పెద్ద హీరోల్లో ఎవరికీ టెన్షన్ ఉండదని.. నిర్మాతలు..పంపిణీదారులు ఎలాంటి కంగారు పడరని అన్నారు. తాము అనుకున్న ఫిగర్ సినిమా మూడు రోజుల్లోనే సాధించేస్తుందని అన్నారు. ఎన్నో సినిమాల ఫలితాల్ని విశ్లేషించుకున్న తర్వాతనే ఇలాంటి అంచనాకి వచ్చినట్లు చరణ్ తెలిపారు. తనని నమ్మి డబ్బు ఖర్చు పెట్టి సినిమా చేసిన నిర్మాత ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉండటం కోసమే తాను ప్రయత్నిస్తానని అన్నారు.
అయితే 500 కోట్లు ఖర్చు చేసినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడనందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏడు రోజుల తర్వాత మాట్లాడినా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ సినిమా ఎప్పటికీ లైబ్రరీలో నిలిచిపోతుంది. ముందుగా మేం ఎంపిక చేసుకున్న నంబర్ ని అయితే కచ్చితంగా దాటుతాం. మా నిర్మాతలు..పంపిణీదారులు సురక్షితంగా ఉన్నారన్న నమ్మకం ఉంది అని చరణ్ అన్నారు. `ఆర్.ఆర్.ఆర్` చిత్రం జనవరి 7న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. డి.వి.వి. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొత్తానికి ఒమిక్రాన్ టెన్షన్ లో ఉన్న బయ్యరులో నమ్మకాన్ని పెంచేందుకు చరణ్ వ్యాఖ్యలు సహకరించవచ్చు. ఆశించిన వసూళ్లను సాధించగలమన్న ధీమా ఇక ప్రాక్టికల్ గానూ ప్రూవ్ కావాల్సి ఉంది. మరో వారంలోనే రిలీజ్ కి వస్తున్న ఆర్.ఆర్.ఆర్ కి ఒమిక్రాన్ సెగ ఉండదనే అంతా ఆకాంక్షిద్దాం. ఒక రకంగా ఒమిక్రాన్ వల్ల మరణాలు నమోదు కాకపోవడం కొంతవరకూ జనాల్లో స్త్వైర్యాన్ని నింపుతోంది. ఇది ఒక రకంగా పాజిటివ్ యాంగిల్ అని చెప్పాలి.