రామ్ చరణ్ తో రంగస్థలం తీసిన మైత్రి మూవీ మేకర్స్ అప్పుడే మరో సినిమా చేయడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఈసారి చేసే సినిమా రంగస్థలంలా ప్రత్యేకంగానే ఉండాలని అప్పుడే ఒక మాట అనుకున్నారు. ఆర్.ఆర్.ఆర్. తర్వాత యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాలు చేయాలని చరణ్ చూస్తున్నాడు. ఇందుకోసం మైత్రి వాళ్ళు ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి అడ్వాన్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఖైదీ తర్వాత లోకేష్ తమిళంలో విజయ్ తో మాస్టర్ చేసాడు. ఈ సినిమా విడుదలైతే లోకేష్ పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోతాడని కోలీవుడ్ నమ్మకం. మాస్టర్ రిలీజ్ కాకముందే మైత్రి మూవీస్ అతడికి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసేసింది.
ఆర్.ఆర్.ఆర్. తర్వాత ఇది చేయాలంటూ చరణ్ కచ్చితంగా ఫిక్స్ అవలేదు కనుక లోకేష్ కనుక అతడికి నచ్చే కథ తీసుకెళ్తే ప్రాజెక్ట్ సెట్ అయిపోతుంది. అయితే వంశి పైడిపల్లి కూడా చరణ్ కి కథ వినిపించాడని వార్తలొచ్చాయి కానీ ఆ సినిమా ఖాయం చేస్తూ ఇంతవరకు అధికారికంగా ఎవరి నుంచి న్యూస్ రాలేదు. కనుక మాస్టర్ డైరెక్టర్ టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి.