రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఫిక్సేగా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతుంది. ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ని పెంచేసింది.

సమ్మర్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తీ కానున్నట్టు టాక్. ఈ సినిమా పూర్తీ కాగానే చరణ్ నెక్స్ట్ సినిమా ఏమిటి ? అన్న సందేహాలు ఎక్కువయ్యేయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తూనే నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు.

అయన నెక్స్ట్ సినిమా మళ్ళీ త్రివిక్రమ్ తో చేయడానికి ఓకే అయ్యాడు. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి చరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తి పెరగడం, అటు చరణ్ కూడా నెక్స్ట్ సినిమాకు సంబంధించి పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు.

చరణ్ లేటెస్ట్ సినిమా వినయ విధేయ రామ నిరుత్సహ పరచడంతో ఇప్పుడు అయన నెక్స్ట్ సినిమా హిట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. తాజాగా పలువురు దర్శకులతో చర్చలు జరిపిన చరణ్ మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

లెటస్ట్ గా నాని తో గ్యాంగ్ లీడర్ సినిమా చేసాడు విక్రమ్ కుమార్. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినప్పటికీ విక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పినట్టు టాక్ !! సో చరణ్ నెక్స్ట్ సినిమా విక్రమ్ తో ఉంటుందని ప్రచారం అయితే జరుగుతుంది. త్వరలోనే చరణ్ నెక్స్ట్ సినిమా గురించి ప్రకటిస్తాడట !!