రామ్మోహన్ నాయుడికి కుమార్తె

తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రయ్యారు. తమకు కుమార్తె జన్మించినట్టు శనివారం ఆయన ట్వీట్ చేశారు. భార్య శ్రావ్య, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, తన భార్యకు డెలివరీ సమయం దగ్గర పడినందున తొమ్మిది రోజుల పితృత్వ సెలవు ఇవ్వాలని కోరుతూ రెండు రోజుల క్రితం ఆయన లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు లేఖ రాశారు.

జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు పార్లమెంటు సమావేశాలకు రాలేనని, ఇందుకు అనుమతించాలని అందులో కోరారు. తమ కుటుంబంలోకి క్యూట్ బేబీ వచ్చే ఈ సమయంలో తన భార్యకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు అందులో పేర్కొన్నారు. తిరిగి ఫిబ్రవరి 11న సభకు హాజరవుతానని తెలిపారు.