సరికొత్త డిజిటల్ ఐడియాతో మన ముందుకు వచ్చిన రామోజీ రావు

మీడియా మొఘుల్ గా పేరు సంపాదించారు రామోజీ రావు. ఈనాడు సంస్థలను ప్రారంభించి దశాబ్దాలు గడుస్తున్నా విజయవంతంగా నడపగలుగుతున్నారు రామోజీ రావు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా ప్రింట్ మీడియా భారీగా నష్టపోయింది. చాలా పేపర్లు ఇప్పుడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ఇక డిజిటల్ విప్లవం వేళ్ళూనుకునిపోయి ఉన్నా కూడా ఈ రంగంలో ఉన్న కాంపిటీషన్ కారణంగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. అందుకే రామోజీ రావు నేతృత్వంలోని ఈనాడు గ్రూప్ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. సౌతిండియాలో నాలుగు ప్రధాన మీడియా సంస్థలు చేతులు కలిపాయి.

తెలుగుకు ఈనాడు, తమిళంలో దినమలార్, మళయాళానికి సంబంధించి మనోరమా ఆన్లైన్, కన్నడ నాటకు ప్రజావాణి ఆన్లైన్ చేతులు కలిపి ఒకే వేదికపైకి వచ్చాయి. ఈ నాలుగు మీడియా సంస్థలు కలిసి సౌత్ ప్రీమియం పబ్లిషర్స్ పేరిట ఒక విభాగాన్ని ప్రారంభించాయి.

దీని ప్రకారంగా ఎవరైనా యాడ్ ఇవ్వాలి అనుకుంటే నాలుగు మీడియా సంస్థలకు కలిపి యాడ్ మాట్లాడుకోవచ్చు. దీని ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. సౌత్ లో ఇలా ఫేమస్ మీడియా సంస్థలు కలిసి రావడంతో ఈ చర్య ఎంతవరకూ ఫలితాన్ని ఇస్తుందనేది చూడాలి.