‘గద్దలకొండ గణేష్’ లాంటి మాస్ పాత్రలో మెప్పించిన తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాదాపు నాలుగు నెలలు బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకొని బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా మొదలు పెట్టారు. ఫిబ్రవరిలో మొదలు పెట్టి వైజాగ్ లో ఈ చిత్ర తొలి షెడ్యూల్ ని పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ మొదలు పెట్టేలోపే కరోనా మహమ్మారి తెచ్చిన లాక్ డౌన్ వలన సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి.
ఇటీవలే తక్కువ మందితో షూటింగ్స్ కి పర్మిషన్ రావడంతో మళ్ళీ వరుణ్ తేజ తన బాక్సింగ్ ట్రైనింగ్ మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే మొదటగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ తల్లి పాత్రకోసం రమ్యకృష్ణని అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలయ్యే టైంకి సడన్ గా రమ్యకృష్ణ ప్లేస్ లో నదియా వచ్చారు. ఫస్ట్ షెడ్యూల్ లో కూడా పాల్గొన్నారు. అసలు ఎందుకు రమ్యకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్ అయ్యారు అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం.
రమ్యకృష్ణ ఈ సినిమా కోసం రోజుకి 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. ఫుల్ లెంగ్త్ రోల్ కావడం వలన ఆమెకి ఇవ్వాల్సిన బడ్జెట్ బాగా ఎక్కువ అవుతుండడంతో ఈ చిత్ర టీం రమ్యకృష్ణని వద్దనుకుని నదియాని రంగంలోకి దించారట. వరుణ్ తేజ్ ఫాదర్ పాత్రలో మాధవన్ కనిపించనున్నారు. అలాగే బాక్సింగ్ రింగ్ లో వరుణ్ తేజ్ ని ఢీ కొట్టే విలన్ గా యంగ్ హీరో నవీన్ చంద్ర కనిపించనున్నాడు.
సిద్దు ముద్ద – అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. పలువురి పేర్లు వినిపిస్తున్నా హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు.