పునీత్ మరణం.. బన్నీకి రానా ఉపదేశం!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో అన్ని భాషల పరిశ్రమలు ఒక్కసారిగా మూగబోయాయి. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులతో పునీత్ కి ఉన్న అనుబంధం అంత గొప్పది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలంతా పునీత్ కి మంచి స్నేహితులు. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో బన్నీ పునీత్ మరణంపై ఆవేదనను వ్యక్తం చేసిన తీరు చర్చకు వచ్చింది. తన స్నేహితుడు రానా ఫోన్ కాల్ ని సింక్ చేస్తూ చక్కని విషయాలు చెప్పారు. పునీత్ చాలా మంచి వారు. నేను బెంగుళూరు వెళ్లినా..తాను హైదరాబాద్ వచ్చినా కచ్చితంగా ఒకరికొకరం కాల్ చేసుకుంటాం. మంచి చెడులు మాట్లాడుకుంటాం. అందుబాటులో ఉంటే కలుస్తాం. ఆ ఫోన్ కాల్ ఇద్దరి మధ్య ఎన్నో విషయాల్ని లీక్ చేస్తుంది.. అని అన్నారు.

`పుష్ప` సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు రానా ఫోన్ చేసాడు. నేను చూసుకోలేదు…ఫోన్ లిప్ట్ చేయలేదు. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తర్వాత నేను కాల్ చేస్తే ఎలా ఉన్నావ్ అని అడిగాడు. ఎందుకంటే రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఉంటున్నామో కూడా తెలియదు. ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాగే పునీత్ మనందర్ని విడిచి ఒక్క క్షణంలో వెళ్లిపోయారు. అందుకే ఈ ఫోన్ కాల్ అనేది ఓ సందేశం లాంటింది.

కుటుంబం..స్నేహితులు..అవసరమైన ప్రతీ ఒక్కరితో సన్నిహితంగా ఉండాలి. రేపు అనేది మన చేతుల్లో ఉండదు. అలాగని అందరూ ఆకస్మికంగా చనిపోతారని కాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలన్నది తన ఉద్దేశమని బన్నీ చెప్పుకొచ్చారు. బన్నీ నిజంగా చక్కని సందేశాన్ని పాస్ చేసారు. ఎన్ని సడెన్ డెత్ లు ఉన్నా..దానికి ముందు ఓ ఆప్షన్ ఉంటుంది. దానికోసం ఓ ప్రయత్నాన్ని ఏదో ఒక రూపంలో ఆపదలో ఉన్నవారు కచ్చితంగా చేస్తారు. ఆ సమయంలో అందుబాటులో ఉంటే ఆ ప్రాణం నిలబడుతుంది! అనడానికి ఎన్నో సాక్ష్యాలు.. సందర్భాలు కూడా ఉన్నాయి.