ఇంటర్నేషనల్ సెలబ్రిటీ టాక్ షో హోస్ట్ గా రానా దగ్గుబాటి

టాలీవుడ్ లో రానా దగ్గుబాటి అంత వెర్సటైల్ పర్సన్ మరొకరు ఉండరేమో. హీరోగా టాలీవుడ్ కు పరిచయం కాకముందే రానా దగ్గుబాటి యానిమేషన్ రంగంలో పనిచేసాడు. అలాగే హీరో అయిన తర్వాత తండ్రి సురేష్ బాబు నుండి ప్రొడక్షన్ బాధ్యతలు, స్క్రిప్ట్ సెలక్షన్ లో సహాయాలతో పాటు హోస్ట్ గా కూడా వ్యవహరించాడు.

నెం 1 యారి విత్ రానా టాక్ షో బాగా పాపులర్ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి మరోసారి హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఇంటర్నేషనల్ ప్రమాణాలతో రూపొందే టాక్ షో కు హోస్ట్ గా మారతాడు. అలాగే ఈ టాక్ షో కు ప్రముఖ సెలబ్రిటీలు వస్తారు.

ఒక ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ సంస్థ ప్రస్తుతం ఈ టాక్ షో ను రూపొందించడానికి ప్రణాళికలు రచిస్తోంది.ఇక సినిమాల విషయానికి వస్తే రానా దగ్గుబాటి నటించిన అరణ్య చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఇటీవలే విరాటపర్వం షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టాడు రానా. హిరణ్యకశ్యప షూటింగ్ ను కూడా మొదలుపెట్టాల్సి ఉంది.