సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్ సీరత్ కపూర్, షాలినీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ తాజాగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమా క్షణం తర్వాత నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని దర్శకుడు రవికాంత్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రానా నిర్మించిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.
తాజాగా దర్శకుడు రవికాంత్ ఒక ప్రముఖ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… క్షణం చిత్రం తర్వాత వెంటనే ఒక సినిమా తీయాలనుకున్నాను. రానాను హీరోగా ఊహించుకుని కథ రాసుకున్నాను. ఆ కథ కోసం ఏడాది సమయం పట్టింది. సినిమా షూటింగ్ కు వెళ్లాలని అనుకుంటున్న సమయంలో ఆ కథ రానాకు నచ్చక పోవడంతో మళ్లీ కథ కోసం టైం పట్టింది. ఈసారి కథ నచ్చింది కాని హీరోగా నటించేందుకు ఒప్పుకోకుండా నిర్మించేందుకు ఓకే చెప్పాడు.
రానా నిర్మాణంలో అనగానే అందరు ఆసక్తి చూపించారు. ఈ సినిమాలో షాలిని పాత్రకు మంచి టాక్ వచ్చింది. ఇది థియేటర్ లలో విడుదల చేయాలని తెరకెక్కించాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా సినిమాను రూపొందించాం. సినిమాకు హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో థియేటర్లలో సినిమా విడుదల చేయాల్సింది అని భావిస్తున్నారా అంటూ ప్రశ్నించగా అదేం లేదు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు కనుక ఓటీటీలో విడుదల చేయడం మంచిదని భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.