వెండి తెర స్టార్స్ మద్య ప్రేమలు పుట్టడం.. ప్రేమను పెళ్లిగా మార్చుకోవడం వంటివి చాలా కామన్ విషయాలు. ఇక బుల్లి తెర పై కూడా కపుల్స్ గా కనిపించిన వారు ఆ తర్వాత తర్వాత కాలంలో ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం కూడా మనం చూశాం. త్వరలో బుల్లి తెర కపుల్స్ రవికృష్ణ మరియు నవ్య స్వామి లు కూడా పెళ్లి పీఠలు ఎక్కడం ఖాయం అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. కాని ఇప్పటి వరకు వారు ఇద్దరు కూడా ఆ విషయాన్ని తేల్చడం లేదు.
ఇద్దరి మద్య ఏమీ లేదు అంటూనే సోషల్ మీడియాలో లవ్ ఈమోజీలు షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక నెటిజన్ గతంలో నవ్య స్వామి ప్రేమలో ఉండేది. అవిష్ గౌడ్ తో ఆమె ప్రేమ వ్యవహారం సుదీర్ఘ కాలం పాటు సాగింది. ఆతడితో బ్రేకప్ చెప్పి ఇప్పుడు రవికృష్ణ తో రిలేషన్ లో కొనసాగుతోంది అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో అతడు చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. నిజంగానే అవిష్ గౌడ్ తో నవ్య కు ప్రేమ ఉందా.. అది నిజం అయితే రవికృష్ణ తో కూడా ప్రేమ ఉన్నట్లే అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.