మాస్ రాజా కాస్ట్లీ కార్ కలెక్షన్ చూస్తే మైండ్ బ్లాకే

మాస్ మహారాజా రవితేజ `క్రాక్` బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్పీడు పెంచేశారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టేశారు. ఆయన చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజను చిత్రాల వరకు వున్నాయి. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేస్తూ వరుసగా షాక్ లిస్తున్నారు. నేడు మాస్ మహా రాజా రవితేజ పుట్టిన రోజు. నేటితో ఆయన 54వ ఇయర్ లోకి ఎంటరయ్యారు. సాధారణ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో ఒకరిగా గుర్తింపుని సొంతం చేసుకున్నారు.

లేడీ అమితాబ్ విజయశాంతి నటించిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ `కర్తవ్యం` చిత్రంతో రవితేజ కెరీర్ ఓ సాధారణ నటుడిగా మొదలైంది. ఈ మూవీ ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. కన్నడ చిత్రం `అభిమన్యు`లో స్టూడెంట్ లీడర్ గా కింగ్ నాగార్జున నటించిన `చైతన్య`లో రేసర్ గా ఆజ్ కా గూండారాజ్` లో చిరు స్నేహితుల్లో ఒకడిగా గుణశేఖర్ సంచలన చిత్ర `లాఠీ`లో హీరో ప్రశాంత్ కు రైట్ హ్యాండ్ గా నటించిన రవితేజ కెరీర్ `సింధూరం`తో ఒక్కసారిగా మారింది. ఆ తరువాత శ్రీను వైట్ల `నీకోసం`తో పూర్తి స్థాయి హీరోగా మారిన రవితేజ ఇప్పడు టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో ఓకరిగా వెలుగొందుతున్నారు.

ప్రస్తుతం ఐదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న మన మాస్ రాజా కార్లంటే చాలా ఇష్టం. మార్కెట్ లోకి కొత్త మోడల్ కార్ వచ్చేసిందంటే తన ల్యాన్ లో దిగిపోవాల్సిందే. ఇంతకీ మన మాస్ రాజా దగ్గర వున్న కాస్ట్లీ కార్లేంటో ఒక సారి చూద్దాం. రేంజ్ రోవర్ ఎవక్యూ దీని ధర 63.82 లక్షలు. 9 కలర్ లలో అందుబాటులో వుండే ఈ కారు 7 మోడల్ ని రవితేజ సొంతం చేసుకున్నారు. దీని తరువాత బీఎండబ్ల్యూ ఎం 6 మోడల్ కార్ కూడా వుంది. దీని ధర 1.24 క్రోర్స్. ఇక మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కూడా రవితేజ వాడారు. దీని ధర 2.43 క్రోర్స్.

ఈ కార్ల కలెక్షన్ చూసిన వాళ్ల మైండ్ బ్లాకవుతోంది. మాస్ రాజా ఈ రేంజ్ కార్ లని మెయింటైన్ చేస్తున్నాడా? అని అవాక్కవుతున్నారు. ఇదిలా వుంటే వచ్చే నెలలో మాస్ మమారాజా రవితేజ `ఖిలాడీ` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలోనూ అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణతో పాటు నార్త్ ఇండియా ఫిల్మ్ మేకర్ పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడ సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఆయనే `ఖిలాడీ`ని ఉత్తరాదిలో హిందీ వెర్షన్ లో భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో రవితేజ బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుండటం గమనార్హం.