ఈ ఆర్బీఐకి ఏమైంది..?

rbiదేశంలోని బ్యాంకులన్నింటికీ రెగ్యులేటర్ ఆర్బీఐ. అలాంటి ఆర్బీఐ నోట్ల రద్దు తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కుంది. సరిగా నోట్లు సప్లై చేయలేకపోయిందని ఉద్దేశపూర్వకంగా జనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందని మండిపడుతున్నారు సామాన్యులు.

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతి అంతమౌతుందని ప్రధాని మోడీ చెప్పారు. అలాగే ఆర్బీఐ కూడా నకిలీనోట్లకు కూడా చెల్లుచీటీ తప్పదని చెప్పింది. కానీ నిజంగా అలా జరిగిందా.. లేదా అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. నోట్లు రద్దైన తర్వాత నుంచి మొన్నటి వరకూ చాలా నోట్లు జమయ్యాయని ఆర్బీఐ లెక్కలు
చెప్పింది.

కానీ నోట్లు రద్దైన యాభై రోజులయ్యాక ఆర్బీఐ అంచనాలు తప్పినట్లు కనిపిస్తున్నాయి. నోట్లు రద్దైన దగ్గర్నుంచి ఆర్థిక శాఖ, ఆర్బీఐ, నీతి అయోగ్ ఇలా అందరూ ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్లు చెప్పిన లెక్కేంటంటే డిసెంబర్ 10 నాటికే పన్నెండు లక్షలు బ్యాంకుల్లో జమయ్యాయని. కానీ జరిగింది వేరు.

కానీ నవంబర్ 8న ప్రధాని రద్దు చేసిన కరెన్సీ మొత్తం విలువ 14.2 లక్షల కోట్లు. ఈ రెండు లక్షల కరెన్సీ డిఫరెన్సీ ఇప్పుడు ఆర్బీఐ మౌనాన్ని ఆశ్రయించేలా చేసింది. పాతనోట్లపై కొత్త ఆర్డినెన్స్ కూడా ఈ రెండు లక్షల కోట్ల కోసమే అనుకుంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ వచ్చాకే ఆర్బీఐ ప్రెస్ మీట్ పెట్టేలా ఉంది.