విజయసాయిరెడ్డిది శునకానందం : రేవంత్ రెడ్డి

పీసీసీ అధ్యక్షుడిగా అయినప్పటి నుండి రేవంత్ రెడ్డి బిజీ బిజీగా మారిపోయాడు. ఆయన వరుసగా ముఖ్య నాయకులతో కార్యకర్తలతో భేటీ అవ్వడంతో పాటు మీడియా అధినేతలతో కూడా భేటీ అయ్యి సహకరించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన పై కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్ లో జాయిన్ అయిన కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. రేవంత్‌ రెడ్డి ని జనాలు చెప్పులతో కొట్టే రోజు వస్తుంది అంటూ సుధీర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌ స్పందించాడు. సుధీర్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదు. అభివృద్ది కోసం పార్టీ మారుతున్నట్లుగా చెప్పి పదవులు అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నాడు.

విజయసాయి రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు. ఆయనది శునకానందం.. ఆయన తిక్కలోడు విజయసాయి రెడ్డి మాటలను తాను పట్టించుకోను అంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఏపీ నాయకుడు అయిన విజయసాయి రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటూ కొందరు టీ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి తీరు పై రేవంత్ స్పందన కరెక్ట్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.