ఇండస్ట్రీ ఏదైనా కూడా కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ ను ఎంతగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా కూడా హీరోయిన్స్ మానసిక సంఘర్షణకు లోనవుతూనే ఉన్నారు. ఎంతో మంది హీరోయిన్స్ కెరీర్ ఆరంభంలో కాస్టింగ్ కౌన్ అనుభవంను ఎదుర్కొన్నారు. ఇక ఇప్పటికి కొత్త గా ఇండస్ట్రీకి వచ్చిన వారు ఆ వేదింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. మలయాళం నటి రేవతి సంపత్ నోరు విప్పింది. తనను ఎంతో మంది మానసికంగా వేదించడంతో పాటు లొంగ దీసుకనే ప్రయత్నం చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆమె ను హింసించిన వారి పేర్లు చెప్పాంటూ కొందరు డిమాండ్ చేశారు.
తనను మానసికంగా మరియు శారీరకంగా హింసించిన మొత్తం 14 మందితో కూడిన జాబితాను ఆమె విడుదల చేసింది. ఈ సందర్బంగా ఆమె సోషల్ మీడియాలో ఈ పోరాటంలో తనకు ఏం జరిగినా కూడా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ సవాల్ విసిరింది.
రాజేశ్ టచ్రివర్ (దర్శకుడు)
సిద్ధిక్ (నటుడు)
ఆషికి మహి(ఫొటోగ్రాఫర్)
సిజ్జు (నటుడు)
అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్)
అజయ్ ప్రభాకర్ (డాక్టర్)
ఎంఎస్ పదూష్ (అబ్యూసర్)
సౌరబ్ కృష్ణన్ (సైబర్ బల్లీ)
నందు అశోకన్ (డివైఎఫ్ఐ కమిటీ మెంబర్)
మాక్స్వెల్ జోస్ (షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్)
షానుబ్ కరావత్ (యాడ్ డైరెక్టర్ )
రాగేంద్ పై (క్యాస్టింగ్ డైరెక్టర్)
సరున్ లియో (ఈఎస్ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్)
బిను (సబ్ ఇన్స్పెక్టర్ పొన్తూరా స్టేషన్, తిరువనంతపురం)