ఎక్స్ క్లూజివ్: పవర్ స్టార్ చిత్రం తర్వాత మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయనున్న వర్మ

రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు కావాల్సింది అంతా కాంట్రవర్సీలే. ఎంత కాంట్రవర్సీ వస్తే తనకు అంత లాభం. వివాదాలతో పబ్బం గడుపుకుంటున్న రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ అనే చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తిని తన వ్యక్తిగత జీవితాన్ని కూడా టచ్ చేస్తూ ఇంతలా దిగజారి సినిమా తీయడం అవసరమా అని అందరూ అనుకున్నారు. అయితే ఆ ఆలోచన వస్తే అతను రామ్ గోపాల్ వర్మ ఎందుకవుతాడు.

పవర్ స్టార్ సినిమానే అనుకుంటే ఇప్పుడు వర్మ మరోసారి మెగా ఫ్యామిలీను టార్గెట్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం వర్మ ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయాలని అనుకుంటున్నాడట. ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి రావడమే ఒక సంచలనం. వరసగా బ్లాక్ బస్టర్లతో తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ కు ఒకటొకటిగా ప్లాపులు వెంటాడాయి. దాన్నుండి కోలుకునేలోపే అర్ధాంతరంగా తన జీవితాన్ని చాలించాడు.

మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనకాల ఉందని అప్పట్లో ఒక ప్రచారం నడిచింది. అయితే దాన్నెవరూ అధికారికంగా నిరూపించలేకపోయారు. ఇప్పుడు ఈ పాయింట్ ను వర్మ పట్టుకుని మరోసారి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకూ నెరవేరతాయో చూడాలి.