వర్మ చావు కోరిక మరీ వైల్డ్‌ గా ఉంది గురూ

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువ ఫేమస్ అయ్యాడు అనడంలో సందేహం లేదు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒక సంచలనంను మాట్లాడే వర్మ తాజాగా తన చావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన చావు ఎలా ఉండాలో చెప్పి బాబోయ్‌ ఇదేం కోరికరా బాబు అంటూ అంతా నోరు వెళ్లబెట్టేలా చేశాడు.

వర్మ మాట్లాడుతూ.. చనిపోవడం అనేది చాలా కామన్‌ విషయం. కనుక చావు గురించి భయపడుతు బాధ పడుతూ ఉండక్కర్లేదు. చావు ఎప్పుడైనా వస్తుంది కనుక అనుబాంబు పేలుతున్న సమయంలో చూస్తూ చనిపోవాలని కోరిక అన్నాడు. అనుబాంబు పేలుడును ఏ ఒక్కరు చూడలేరు. కాని అది ఎలా పేలుతుంది అనే విషయాన్ని నేను చూడాలనుకుంటున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.