రామ్ గోపాల్ వర్మ.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడంలో ఈయనను మించిన వారు ఉండరేమో. తాను మాట్లాడేది ఎవరి గురించైనా ఏమాత్రం ఆలోచించకుండా మాట్లాడేయడం వర్మ స్టైల్. సినిమాల విషయానికొస్తే రామ్ గోపాల్ వర్మ స్థాయి దర్శకుడిగా ఎప్పుడో పడిపోయింది. తన దగ్గరనుండి సిన్సియర్ సినిమా వచ్చి చాలా కాలమే అయింది. అయినా ప్రతీ సారీ తన తర్వాతి సినిమాకు బజ్ తీసుకురావడం, పబ్లిసిటీ చేసుకోగలగడం వర్మ ప్రత్యేకత.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ అనే ఒక అడల్ట్ సినిమా తీసాడు. ఈ సినిమా ద్వారా అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో క్లైమాక్స్ ను విడుదల చేసిన వర్మ దాని ద్వారా లాభాలు అందుకునేలానే ఉన్నాడు. కంటెంట్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.
ఇక అసలు విషయానికి వస్తే, ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం హిట్ సంగతి అటుంచి ప్లాపైతే మాత్రం ఆనందించే వాళ్ళే ఎక్కువ. బయటకు సానుభూతి ఉన్నా వాళ్ళు లోపల తెగ ఆనందిస్తారు. ఇండస్ట్రీ అంతా ఒక్కటి, కళామతల్లి అనే మాటలను నేను అసలు నమ్మను. సినిమా అనేది ఒక బిజినెస్. ప్రతి సెలబ్రిటీకి వృత్తిపరమైన ఈర్ష్య ఉంటుంది. అది వారి రక్తంలో కలిసిపోయింది. వేరే వాళ్ళ సినిమాలు సక్సెస్ అయితే చూసి తట్టుకోలేరు. అందుకే ఆర్ ఆర్ ఆర్ ప్లాపయితేనే ఎక్కువ మంది ఆనందిస్తారు అని తెలిపాడు.