RRR అప్డేట్: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘కొమురం భీమ్’ పోస్టర్..!


దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో తారక్ ‘కొమురం భీమ్’ గా నటిస్తుండగా.. ‘అల్లూరి సీతారామరాజు’గా చరణ్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన హీరోల ఇంట్రో వీడియోలు – హీరోయిన్ల ఫస్ట్ లుక్స్ – అజయ్ దేవగన్ బర్త్ డే గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అలానే చెర్రీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన అల్లూరి సీతారామరాజు అవతారం అంచనాలు రెట్టింపు చేసింది. ఈ క్రమంలో రేపు మే20న ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ట్రిపుల్ ఆర్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ‘ఆర్.ఆర్.ఆర్’ ట్వీటర్ వేదికగా వెల్లడించింది. మే20న ఉదయం 10 గంటలకు ఇంటెన్స్ కొమురం భీమ్ ని చూపించబోతున్నట్లు తెలిపారు. దీంతో గోండ్రు బెబ్బులి భీమ్ లుక్ ఎలా ఉండబోతోందో అని అభిమానల్లో ఆతృత ఎక్కువైంది. కాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్ – ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్