కొమరం భీమ్ టీజర్: ఆర్ ఆర్ ఆర్ రికార్డుల వేట మొదలైంది

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కలిసి నటిస్తుండడం కొసమెరుపు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తీస్తోన్న ఫిక్షనల్ డ్రామా ఈ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై సీన్లను చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిన్న కొమరం భీమ్ పాత్ర పరిచయ వీడియోను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అసలే ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నా కానీ వాటిని అందుకునే రీతిలోనే జక్కన్న ఈ వీడియోను రూపొందించడం హైలైట్. ఇక ఈ టీజర్ రికార్డుల వేటను కొనసాగిస్తోంది.

24 గంటలు కూడా గడవకముందే ఈ టీజర్ 15 మిలియన్ వ్యూస్ ను సాధించగా ఇప్పటికే 950K+ లైకులను సాధించింది. 900K+ లైకులను సాధించిన మొదటి టీజర్ ఈ కొమరం భీమ్ వీడియో. 24 గంటల్లోనే ఈ టీజర్ 1 మిలియన్ లైకులను అందుకోనుండడం నిజంగా విశేషమే. మరే టీజర్ కూడా ఈ ఫీట్ ను అందుకోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ ఎలాంటి రికార్డులను సెట్ చేసాడన్నది ఆసక్తికరంగా మారింది.