టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా రాబడుతుందనే విషయం ఇప్పటికే నిరూపితం అయ్యింది. అందుకే థియేట్రికల్ రైట్స్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా కొనుగోలు జరుగుతున్నాయి. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే బడ్జెట్ పూడిపోయే విధంగా బిజినెస్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజ సంస్థలు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఇక శాటిలైట్ రైట్స్ కోసం జాతీయ స్థాయి టీవీ ఛానెల్స్ పోటీ పడుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఒక బాలీవుడ్ దిగ్గజ నిర్మాత శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ అన్ని భాషలకు గాను భారీ మొత్తంకు కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన రేట్ల అన్నింటికి మరో 15 శాతం అదనంగా చేర్చి తాను ఇస్తానంటూ ఆయన చెబుతున్నాడట. దాంతో నిర్మాతలు ఆయనకు ఆ రైట్స్ ను అమ్మేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ ను మరియు డిజిటల్ రైట్స్ ను కంబైన్ గా కొనుగోలు చేసి ఆయన ఆ తర్వాత వాటిని అమ్మేసుకుంటాడనే టాక్ వినిపిస్తుంది. ఈ రైట్స్ తోనే దాదాపుగా 400 కోట్ల వరకు రాబట్టే అవకాశాలను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది చూడాలి.