కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనధికార లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. నార్త్ లో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ ఇంకా జరుగుతున్నాయి కానీ సినిమా విడుదలలు అన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం వంటి మీడియం బడ్జెట్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఆచార్య, నారప్ప కూడా వాయిదా పడబోతున్నాయి.
ఇక ప్యాన్ ఇండియా సినిమా అయిన కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా వాయిదా పడక తప్పదంటున్నారు. మరి ఆర్ ఆర్ ఆర్ పరిస్థితి ఏంటి? అక్టోబర్ 13న విడుదలవుతోన్న ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా అంటే రాజమౌళి మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం అని అంటున్నాడు. అక్టోబర్ 13 విడుదల తేదికి రాజమౌళి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికి ఇండియన్ మార్కెట్ పూర్తిగా కోలుకుంటుందని రాజమౌళి అండ్ కో భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.