ఒకటైతే ఇప్పటికే క్లియర్ అయింది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఈ ఏడాది ఇక కష్టమే. ఇటీవలే ఎన్టీఆర్ అక్టోబర్ 13 విడుదలపై ఇంకా పాజిటివ్ గానే ఉన్నాం అని అన్నా కానీ అది జరగని పనే. ఎందుకంటే ఇంకా 40 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. అలాగే విఎఫ్ఎక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కలుపుకుంటే ఈ ఏడాది విడుదల జరగని పని.
ఇందుకోసమే దర్శకుడు రాజమౌళి సమ్మర్ 2022 విడుదల అయితే ఎలా ఉంటుందన్న ప్రపోజల్ ను టీమ్ ముందు ఉంచాడట. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం అది చాలా ఆలస్యమవుతుంది సంక్రాంతి 2022 అయితే బెస్ట్ అని అంటున్నారు.
ఒకవేళ సంక్రాంతికే రావాలి అని అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాల నుండి ఇబ్బందులు ఎదుర్కోవాలి. వారు ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.