నాటు నాటు కు ఊర మాస్ రికార్డ్

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సందడి కొనసాగుతోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా షురూ అవుతున్నాయి. ఇప్పటికే వచ్చిన పాటలు మరియు పోస్టర్ లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా లోని నాటు నాటు సాంగ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా విడుదల అయిన నాటు నాటు సాంగ్ ఇటీవలే 80 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. తెలుగు వర్షన్ నాటు నాటు భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. ఆల్ టైమ్ రికార్డును ఈ పాట దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా అంతా నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలో ఊర మాస్ రికార్డు ఈ పాటకు యూట్యూబ్ లో దక్కింది.

ఈమద్య కాలంలో యూట్యూబ్ రికార్డులు కొత్త కొత్తవి చాలా నమోదు అవుతున్నాయి. తాజాగా నాటు నాటు పాటకు గాను యూట్యూబ్ లో అరుదైన రికార్డు దక్కింది. తెలుగు సినిమాలకు చెందిన ఏ పాటలు కూడా యూట్యూబ్ లో మిలియన్ లైక్స్ మూడు వారాల వ్యవధిలో దక్కించుకోలేక పోయాయి. కాని నాటు నాటు సాంగ్ మాత్రం కేవలం మూడు వారాల్లోనే మిలియన్ లైక్స్ ను దక్కించుకుంది. పాటలోనే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మాస్ డాన్స్ మరియు రాజమౌళి చూపించిన విజువల్స్ ఇంకా ఇతర నటీ నటులు కూడా స్క్రీన్ లో కనిపించడం వల్ల అభిమానులు మరియు ప్రేక్షకులు లైక్ కొట్టకుండా ఉండలేక పోతున్నారు. తాజాగా నాటు నాటు అరుదైన ఈ రికార్డును దక్కించుకుంది.

ముందు ముందు వ్యూస్ పరంగా కూడా ఈ పాట సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో ఈ పాటకు రీల్స్ మరియు కవర్ స్టాంగ్స్ చేయడం జరుగుతుంది. ఈ తక్కువ సమయంలోనే లక్షల మంది అప్పుడే ఈ పాటకు తమ స్టెప్పులను జోడించి స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ పాట సినిమాలో ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు గాను ఆసక్తిగా ఉన్నాడు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఈ సినిమాలో తమ నట విశ్వ రూపం చూపించబోతున్నారు అనేందుకు పాటలో వారు ఇద్దరు వేసిన డాన్స్ సాక్ష్యం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.