అనుష్క సర్జరీ చేయించుకుందా?

ఒక నెల రోజుల క్రితం వరకు చాలా చాలా లావుగా కనిపించిన అనుష్క తాజా ‘బాహుబలి’ ఇంటర్వ్యూల్లో బాగా తగ్గినట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమె ముఖంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. తన ఫిజిక్‌పై వస్తోన్న కామెంట్స్‌కి ఆమధ్య కాస్త ఘాటుగా స్పందించిన స్వీటీ వాటిని సీరియస్‌గానే తీసుకున్నట్టుంది.

అయితే ఇంత తక్కువ వ్యవధిలో అంత బరువు తగ్గేసరికి ఆమె లైపోసక్షన్‌ లాంటి సర్జరీలేవో చేయించుకుందనే పుకార్లు మొదలయ్యాయి. కానీ అనుష్క యోగా టీచర్‌ అనే సంగతిని మర్చిపోకూడదు. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలకి ఆమె యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా వ్యవహరించింది.

ఆమె కిటుకులతో, ఆమె చెప్పిన ఆసనాలతో స్లిమ్‌ అయిన వారు చాలా మంది వున్నారు. బహుశా ఇప్పుడు స్ట్రిక్ట్‌ డయట్‌తో, యోగా టెక్నిక్స్‌తోనే అనుష్క సన్నబడి వుండవచ్చు. లైపో చేయించుకుంటే కనిపించే డ్రాస్టిక్‌ ఛేంజ్‌ ఇంకా ఆమెలో లేదు. బాహుబలి తర్వాత రిటైర్‌ అయిపోవాలని అనుకోవడం వలనో ఏమో ఆమె ఫిజిక్‌పై దృష్టి పెట్టలేదు.

కానీ ఇప్పుడు తనకి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. బాలీవుడ్‌ కూడా ఈ బాహుబలి సుందరిపై కన్ను వేసింది. ఈ నేపథ్యంలో అనుష్క కెరియర్‌ మరికొన్నాళ్లు సాగుతుంది కనుక ‘సైజ్‌ జీరో’ నుంచి జీరో సైజ్‌కి వచ్చే ప్రయత్నాల్లో పడ్డట్టుంది.