యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని విడుదల చేసాడు. ఈ సినిమాతోనే తెలుగులో థియేటర్లు తెరుచుకున్నాయి. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడింది. సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర విజయంతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు సాయి తేజ్.
ఈ చిత్రం తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు బయటకు వచ్చింది. ఈ చిత్రానికి రిపబ్లిక్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. రాజకీయాలు, సమాజం నేపథ్యంలో రిపబ్లిక్ రూపొందుతోన్న విషయాన్ని ధృవీకరించారు.
“యువర్ హానర్, ప్రజలెన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాల్ని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు, ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పుని ఒకరు దిద్దుకుంటూ క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రభుత్వం అవుతుంది. అదే అసలైన రిపబ్లిక్” అని సాయి తేజ్ వాయిస్ ఓవర్ తో సాగే మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. సమ్మర్ కు రిపబ్లిక్ విడుదలవుతుంది.