సల్మాన్ ఖాన్ వ్యక్తిగత బాడీ గార్డ్ జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే

సెలబ్రిటీలకు బాడీగార్డ్ లు ఉండటం సర్వసాధారణం. వారి రక్షణ కోసం, అభిమానుల తాకిడి తట్టుకోవడం కోసం బాడీ గార్డ్ లు పహారా కాస్తుంటారు. బాలీవుడ్ నెం 1 హీరో సల్మాన్ ఖాన్ కు కూడా బాడీ గార్డ్ ఉన్నాడు. అతని పేరు షేరా. ఒరిజినల్ నేమ్ గుర్మీత్ సింగ్ జాలీ. సల్మాన్ ఖాన్ తో గత 26 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు షేరా. తనకు ఈరోజు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందంటే దానికి సల్మాన్ ఖాన్ కారణమని చెబుతుంటాడు.

సల్మాన్ దగ్గర నేను పనిచేయకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే షేరా జీతం గురించి తెలిస్తే మనందరం షాకవ్వాల్సిందే. అతనికి నెలకు 15 లక్షలు చొప్పున ఏడాదికి 2 కోట్ల రూపాయలను జీతంగా చెల్లిస్తాడట సల్మాన్ ఖాన్. కేవలం సల్మాన్ కు మాత్రమే కాకుండా అంతర్జాతీయ సెలబ్రిటీలు ఎవరు వచ్చినా కూడా షేరా భద్రతను అందిస్తాడు.