కానుకల విలువ! కత్రిన పెళ్లికి 20కోట్లు.. భాయ్ బర్త్ డేకి 20కోట్లు!!

నటుడవ్వాలి. పుట్టినరోజును తమ స్నేహితుల సమక్షంలో ఘనంగా జరుపుకోవాలి. అంతేనా కొలీగ్స్ నుంచి అందే ఖరీదైన కానుకల్ని అందుకుని ఆనక ఎంత మొత్తం జమ అయ్యిందో లెక్కలు వేయాలి. మొన్నటికి మొన్న కత్రిన కైఫ్- విక్కీ జంటకు పెళ్లి కానుకలే 20కోట్లు పైగా అందాయంటే అంతా షాక్ తిన్నారు.

ఇప్పుడు పెళ్లి కాకపోయినా కేవలం పుట్టినరోజుకే 22కోట్ల విలువైన కానుకలు అందుకున్నాడు సల్మాన్. భాయ్ అంటే మజాకానా! అతడికి అందిన ఖరీదైన బహుమతుల జాబితాని పరిశీలిస్తే షాకవ్వాల్సిందే. రూ. 12 కోట్ల ఖరీదు చేసే ఫ్లాట్.. BMW.. రోలెక్స్ వాచ్ ఇలా ఆ లిస్ట్ లో చాలా ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన 56వ పుట్టినరోజును తన కుటుంబ సభ్యులు.. కొలీగ్స్ స్నేహితులతో డిసెంబర్ 27న తన పన్వెల్ ఫామ్ హౌస్ లో జరుపుకున్నారు.

కోస్టార్స్ కత్రినా కైఫ్- శిల్పాశెట్టి – సంజయ్ దత్ – జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి ఖరీదైన బహుమతులను సల్మాన్ భాయ్ అందుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు కూడా అందుకున్నాడు. కత్రినా కైఫ్ సల్మాన్ కు దాదాపు రూ. 2-3 లక్షల విలువైన బంగారు బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇవ్వగా.. జాక్వెలిన్ అతనికి రూ. 10-12 లక్షల విలువైన చోపార్డ్ బ్రాండ్ కు చెందిన వాచ్ ను బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది. సంజయ్ దత్ సల్మాన్ కు రూ.7-8 లక్షల విలువైన డైమండ్ బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇచ్చాడు. అనిల్ కపూర్ రూ.27-29 లక్షల విలువైన లెదర్ జాకెట్ ను..శిల్పాశెట్టి రూ.16-17 లక్షల విలువైన బంగారం- డైమండ్ బ్రాస్ లెట్ ను బహుమతిగా ఇచ్చారు. సల్మాన్కు కుటుంబ సభ్యులు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చారు.

సల్మాన్ సోదరి అర్పిత అతనికి రూ. 15-17 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ ను బహుమతిగా ఇచ్చింది. అతని సోదరులు సోహైల్ ఖాన్ – అర్బాజ్ ఖాన్ అతనికి వరుసగా రూ. 23-25 లక్షల విలువైన BMW S 1000 RR .. రూ. 2-3 కోట్ల విలువైన ఆడి ఆర్.ఎస్ Q8 కారును బహుమతిగా ఇచ్చారు.

సల్మాన్ తండ్రి సలీం తన కుమారుడికి జుహులో రూ.12-13 కోట్ల విలువైన అపార్ట్ మెంట్ ను బహుమతిగా ఇవ్వగా.. అర్పితా ఖాన్ భర్త .. సల్మాన్ బావ .. యాంటిమ్ సహనటుడు ఆయుష్ అతనికి రూ.75 వేల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడు. ఇంకా అభిమానులు ఇతర పారిశ్రామిక వేత్తల నుంచి బహుమతులు అందాయి. ఓవరాల్ గా వీటన్నిటి విలువ 22కోట్ల వరకూ ఉంటుందనేది ఓ అంచనా.