నాకెప్పుడు భాష సమస్య కాదు : సమంత

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ సమంత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె బాలీవుడ్ ఎంట్రీకి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఆరంభం అంటున్నారు. ఆ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మడు ముందు ముందు వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు మరియు తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా సినిమాలను ఈమె చేస్తుందని మరోసారి టాక్ నడుస్తున్న సమయంలో సమంత ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది.

తాను సినిమాల్లో నటించేందుకు ఎప్పుడు కూడా భాష సమస్య కాలేదు. నేను కథ నచ్చితే.. ఆ కథలోని పాత్ర నచ్చితే భాష ఏదైనా చేసేందుకు సిద్దంగా ఉంటాను. నాకు నప్పే పాత్ర లభించాలే కాని భాష విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా ఉంటానంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో మంచి పాత్రలు.. కథలు వస్తే నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. సమంత ముందు ముందు వరుసగా హిందీ సినిమాల్లో నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు ఆమె ప్రకటనతో నిజమే అని తేలిపోయింది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఎంత కఠినమైన పాత్రనైనా చేసేందుకు ఈమె సిద్దంగా ఉంటుంది.

బాలీవుడ్ లో ఇప్పటికే ఈమె ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. త్వరలోనే అందుకు సంబంధించిన మరింత క్లారిటీ రాబోతుంది. మరో వైపు ఈమె హీరోయిన్ గా తాప్సి నిర్మాణంలో ఒక బహు భాష సినిమా రూపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇద్దరు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిద్దరు కలిసి ఈమద్య కనిపిస్తున్న కారణంగా ఖచ్చితంగాఆ సినిమా త్వరలోనే ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సమంత వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్ లు చేస్తుందని సమాచారం అందుతోంది. తెలుగులో ఈమె నటించిన శాకుంతలం విడుదలకు సిద్దంగా ఉండగా ఐటెం సాంగ్ తో పుష్ప లో సమంత సందడి చేయబోతుంది. ఇక తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసింది. డిసెంబర్ లో ఆ సినిమా విడుదల అవ్వబోతుంది.