ఫోటో స్టోరి: సామ్ చంపుతోందిగా..!

ఊ అంటావా .. పాటతోనే సమంత తనలోని కొత్త యాంగిల్ ని ప్రదర్శించేందుకు వెనకాడనని నిరూపించింది. చైతో బ్రేకప్ తర్వాత సామ్ వరుస ఫోటోషూట్లతో దూకుడు పెంచింది. ఇక గ్లామ్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు తెలుగు-తమిళంతో పాటు జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు చేస్తోంది. హిందీ ఆడియెన్ కి తనని తాను కనెక్ట్ చేసుకుంటోంది సమంత. అదే క్రమంలో తన ప్రయత్నం కూడా వైవిధ్యంగా కనిపిస్తోంది.

మునుపటిలా మడి కట్టుకుని కూచుంటే లాభం లేదని భావిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడు హద్దులు చెరిపేసే గ్లామర్ ని తన అభిమానుల ముందు పరిచేస్తోంది. వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది. ఇటీవల లో లెవల్ నెక్ లైన్ డ్రెస్ లో ఒక ఈవెంట్ కు హాజరై హెడ్ లైన్స్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ ఫోటోషూట్ వైరల్ గా మారింది. ఇందులో సామ్ గ్లామర్ షో కిరాక్ పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో సమంతా అభిమానుల సమూహాలు పంచుకున్న స్నాప్ లు వేడెక్కిస్తున్నాయి. సామ్ ఫోటోలో రెడ్ కలర్ ట్యూబ్ టాప్ తో కనిపించింది. తన టోన్డ్ ఫిజిక్ ను కంటికి ఇంపుగా ప్రదర్శించింది..

నిజానికి అందాన్ని అందంగా ఆవిష్కరించడం ఒక కళ. ఈ కళలో సమంత ఆరితేరిపోయింది అంటూ కితాబు అందుకుంటోంది. గ్లామర్ ని అందంగా ఆవిష్కరించేందుకు హద్దులు చెరిపేసేందుకు డేరింగ్ గా మూవ్ అవుతున్న సమంతను అభిమానులు ప్రశంసించకుండా ఆగలేకపోతున్నారు. గ్లామర్ ప్రేమికులకు ఇది విజువల్ ఫెస్ట్ లాంటిది. సామ్ నుంచి కళ్లు తిప్పుకోవడం అంత ఈజీ కాదని తాజాగా రిలీజైన ఫోటో చెప్పకనే చెబుతోంది. సమంత నటించిన శాకుంతలం- యశోద విడుదలకు రావాల్సి ఉంది. ఇవి పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

‘ఫ్యామిలీమ్యాన్’ జోడీతో సామ్
జంట దర్శకులు రాజ్ అండ్ డీకే సక్సెస్ ని ఆస్వాధిస్తున్నారు. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లో సమంతను రాజీ అనే తీవ్రవాది పాత్రకు ఎంపిక చేయడం అది బ్లాక్ బస్టర్ కొట్టడం అంతా ఒక మిరాకిల్ అనుకుంటే ఇప్పుడు అదే జోడీ సమంతతో మరో వెబ్ సిరీస్ కి సన్నాహకాలు చేయడం ఉత్కంఠను పెంచుతోంది. ఇటీవల సామ్ జంట దర్శకులతో ప్రత్యక్షమైంది. సమంత ముంబైలో పని మొదలు పెట్టింది. అక్కడ క్రోమ్ స్టూడియో వద్ద కనిపించింది సామ్.

ఇటీవలే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2022 లో సమంత సందడిని మర్చిపోక ముందే ఇలా ఫ్యామిలీమ్యాన్ దర్శకద్వయంతో కలిసి కనిపించింది. తాజాగా సమాచారం మేరకు.. రాజ్ అండ్ డీకేతో కలిసి తదుపరి వెబ్ సిరీస్ సన్నాహకాల్లో ఉందని అర్థమైంది. రాజ్ – DK ప్రస్తుతం ‘సిటాడెల్ స్పిన్-ఆఫ్’ చిత్రీకరణపై దృష్టి సారించారు. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కథానాయకుడు.

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ డయాస్పోరా సినీప్రియులంతా రాజ్ అండ్ డీకేని గొప్పగా అభిమానించి ప్రేమిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ జోడీతో సమంత అడుగులు తనకు ఇంటర్నేషనల్ అప్పీల్ ని తేనున్నాయి. మరోవైపు సమంత ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.