టాలీవుడ్ లో వున్న చూడముచ్చటైన జంట.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన జంట అంటూ నాగచైతన్య – సమంత జంటపై వినిపించని ప్రశంసలు లేవు. అయితే ఒక్కసారిగా ఈ జంట షాకిచ్చింది. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్టుగా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఏంటీ ఇది నిజమేనా? అని అంతా అవాక్కయ్యేలా చేసింది. ఈ జంట ప్రయాణం నాలుగేళ్లకే మూన్నాళ్ల ముచ్చటవుతుందని ఎవరూ ఊహించలేదు. అభిమానులు ఇదొక జోక్ అని కొట్టి పారేశారు.
కానీ అదే నిజమని తెలిసి షాక్ లో వుండిపోయారు. టాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ వర్గాల్లోనే ముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత విడిపోతున్నామని ప్రకటించి ఇప్పటికి దాదాపుగా 7 నెలలు కావస్తోంది. విడాకులు ప్రకటించిన తరువాత నాగచైతన్య తన సినిమా రిలీజ్ లో భాగంగా మీడియా ముందుకొచ్చారు. కానీ ముందే మీడియాని ఈ విషయంలో కట్టడి చేయడంతో చై నుంచి పెద్దగా సమాధానాలు రాలేదు. విడిపోవడానికి కారణాలు కూడా చెప్పలేదు.
ఇదిలా వుంటే సామ్ కూడా విడాకులు ప్రకటించిన దగ్గరి నుంచి మీడియాకు దూరంగా వుంటూ వస్తోంది. `పుష్ప`లో ఐటమ్ సాంగ్ చేసినా దీని ప్రచారం కోసం మీడియా ముందుకు రాలేదు. మేకర్స్ కూడా సామ్ ని ఈ విషయంలో ఫోర్స్ చేయలేదు. దీంతో సామ్ మీడియా ముందుకొచ్చి దాదాపు 7 నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో సమంత త్వరలో మీడియా ముందుకు రాబోతోందనే వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
సమంత నటించిన తమిళ చిత్రం `కాదువాకుల రెండు కాదల్`. తెలుగులో ఈ మూవీని `కణ్మని రాంబో ఖతీజా` పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 28న ఈ మూవీ తమిళ తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో నయనతార కూడా ఓ హీరోయిన్ గా నటించింది. నయన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత త్వరలో మీడియా ముందుకు రాబోతోంది.
చైతో విడాకులు ప్రకటించిన దగ్గరి నుంచి ఇండైరెక్ట్ గా విడాకులపై సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ లు పెడుతూ చర్చనీయాంశంగా మారిన సామ్ త్వరలో మీడియా ముందు రాబోతుండటంతో మీడియా వర్గాలు సామ్ నుంచి విడాకులకు సంబంధించిన ఆసక్తికర విషయాలని రాబట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. గడిచిన కొంత కాలంగా విడాకుల ఇష్యూపై ఎక్కడా పెదవి విప్పని సమంత తొలిసారి తెలుగు మీడియా ముందు మాట్లాడే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు రానున్న సమంత కన్ఫ్యూజ్ చేస్తుందా..క్లారిటీ ఇస్తుందా? అని అంతా ఆరా తీస్తున్నారు. నిజంగానే సామ్ తన విడాకుల విషయంలో ఏం జరిగిందో క్లారిటీ ఇస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఏం జరగనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.