మాన్సస్ ట్రస్ట్ పదవిలో సంచయితను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు. ఆ విశ్వాసంతో ఆమె బీజేపీ నుండి మెల్ల మెల్లగా దూరం అయ్యి వైకాపాకు దగ్గర అయ్యింది. బీజేపీ నాయకులు ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇటీవల ఆమె మాన్సస్ ట్రస్ట్ పదవి నుండి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఆమెను వైకాపా లోకి పూర్తి స్థాయిలో అధికారికంగా తీసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
విజయనగరం మరియు విశాఖ జిల్లాల్లో వైకాపా బలంగా ఉంది. కాని పార్టీలో ఉన్న అంతర్ఘత కుమ్ములాటల వల్ల పార్టీ నాయకత్వంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే వైకాపా లో సంచయిత ఎంట్రీ ఇస్తే ఆ రెండు జిల్లాల్లో పార్టీ కుమ్ములాటలు తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో సంచయిత కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కనుక ఆమెను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేయించడంతో పాటు జిల్లాలో ఇతర నియోజక వర్గంలో కూడా పోటీ చేసిన వారికి ఆమె మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. కనుక ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించే అవకాశం ఉందటున్నారు.