సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ఈ సినిమా టీజర్ బ్లాక్ బస్టర్ ను కొన్ని వారాల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ టీజర్ ఏకంగా 40 మిలియన్ ల వ్యూస్ ను క్రాస్ అయ్యింది. 1.1 మిలియన్ ల యూట్యూబ్ లైక్స్ తో పాటు 40 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకోవడంతో సర్కారు వారి పాట సినిమాకు ఉన్న బజ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టీజర్ వ్యూస్ విషయంలో టాలీవుడ్ లో నెం.4 స్థానంను సర్కారు వారి పాట దక్కించుకుంది. మొదటి మూడు స్థానాల్లో పుష్ప.. రాధే శ్యామ్ ఆ తర్వాత బాలయ్య అఖండలు ఉన్నాయి. నాలుగు మిలియన్ లు ఆపై వ్యూస్ దక్కించుకున్న టీజర్ ల జాబితాలో మహేష్ బాబు సర్కారు వారి పాట చోటు దక్కించుకోవడంతో అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. #SVPBlasterHits40M అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.
ఇక సర్కారు వారి పాట సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవలే కీర్తి సురేష్ మరియు మహేష్ బాబు ఇంకా ఇంగ్లీష్ ముద్దుగుమ్మలతో పాట చిత్రీకరణ జరిగింది. పాట చిత్రీకరణ ముగిసిందని యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఇదే సమయంలో స్పెయిన్ లోని ఒక క్యాసినో లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ సన్నివేశాల చిత్రీకరణ తో సినిమా మెజర్ పార్ట్ షూటింగ్ పూర్తి అయినట్లుగా అవుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. క్యాసినో లో చిత్రీకరించబోతున్న సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు అన్ని విధాలుగా మహేష్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో సన్నివేశాలను దర్శకుడు పరశురామ్ తీర్చిదిద్దుతున్నాడు.
ఈ సినిమా విడుదలకు సంక్రాంతి ముహూర్తంను ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పటికే జనవరిలో సంక్రాంతి కానుకగా అంటూ పలు సందర్బాల్లో చిత్ర యూనిట్ సభ్యులు వెళ్లడించారు. డేట్ తో సహా ప్రకటించిన తర్వాత ఇప్పుడు సర్కారు వారి పాట విడుదల తేదీ మారే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతికి వారం ముందే విడుదల కాబోతుంది. దాంతో పాటు సంక్రాంతి సందర్బంగా రాధే శ్యామ్ మరియు భీమ్లా నాయక్ సినిమా లు విడుదల అవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కనుక సర్కారు వారి పాట సినిమా ను సంక్రాంతి బరి నుండి తప్పించే యోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి తప్పితే సర్కారు వారి పాట ను సమ్మర్ వరకు వాయిదా వేయాల్సి ఉంటుంది. కనుక సమ్మర్ లో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.