సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ ఎప్పుడంటే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. హైదరాబాద్ లో షూటింగ్ సాగుతోంది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 14న సర్కారు వారి పాట మొదటి పాట కళావతి విడుదలైన విషయం తెల్సిందే.

కళావతి ఎంతటి సెన్సేషన్ అయిందో మనందరం చూసాం. హయ్యస్ట్ వ్యూస్ తో ఈ పాట దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట టీమ్ ఇప్పుడు సెకండ్ పాటపై దృష్టి పెట్టినట్లు సమాచారం. సర్కారు వారి పాట రెండో సింగిల్ ను మార్చ్ 18న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

మొదటి పాట రొమాంటిక్ నెంబర్ కాగా ఇప్పుడు సెకండ్ సింగిల్ గా ఫుల్ మాస్ ట్రీట్ ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పరశురామ్ దర్శకుడు.