ఇటివల అనారాగ్యోనికి గురై ఆస్పత్రిలో చేరిన శశికళ కోలుకున్నారు. ఈరోజు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆమెను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈనెల 27 న ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆమె షుగర్, ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఈ సమయంలోనే ఆమెకు కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆమెను డిశ్చార్జి చేశారు. అయితే.. ఆమె మరో వారం పాటు బెంగళూరులోనే ఉండి.. ఆ తర్వాతే చెన్నై వెళ్తారని తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల నుంచి ఆమె జైలు జీవితం గడిపారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె విడుదల కావడం తమిళనాడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరి.. తమిళ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.