`అర్జున్ రెడ్డి` హిట్ తో ముంబై బ్యూటీ షాలిని పాండే టాలీవుడ్ కెరీర్ కి తిరుగుండదని భావించారు. తొలి సినిమానే పాన్ ఇండియాలో ఐడెంటిటీ తీసుకొచ్చింది. కానీ ఆ సక్సెస్ ని సోపానంగా మార్చుకోవడంలో మాత్రం విఫలమైందనే అనిపిస్తుంది. అదే సమయంలో బాలీవుడ్ లో `మేరీ నిమ్మో` చిత్రంలో..`మహానటి`.. `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రాల్లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది.
అటుపై `118` లో లీడ్ రోల్ పోషించింది. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ మినిమం రేంజ్ హీరోల సరసన ఇప్పటికీ అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకబడే ఉంది. మధ్యలో అప్పుడప్పుడు కొన్ని తమిళ్..హిందీ సినిమాల్లోనూ నటించింది. కానీ అక్కడా సక్సెస్ కాలేదు. ఇటీవలే రణ్ వీర్ సింగ్ సరసన నటించిన `జయేష్ భాయ్ జోర్డార్` రిలీజ్ అయింది. అగ్ర హీరోతో ఛాన్స్… సినిమా సక్సెస్ అవ్వడం ఖాయమని టాక్ వినిపించింది. కానీ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు చూస్తే నిరాశ తప్పదు.
రివ్యూలు ఏమంత పాజిటివ్ గా రాలేదు. దీంతో మరోసారి షాలిని పాండేకి నిరాశ తప్పలేదు. ఇలా మొ్తంగా షాలిని పాండే కెరీర్ గ్రాప్ పరిశీలిస్తే సక్సెస్ లు ఉన్నా హీరోయిన్ గా మాత్రం ఎస్టాబ్లిష్ కాలేకపోతుందన్నది అర్ధమవుతుంది. తొలి సినిమా సక్సెస్ తర్వాత అమ్మడు ఎంపిక చేసుకున్న స్ర్కిప్ట్ లు ఆమెని ఆ స్థాయిలో నిలబెట్టలేకపోయాయి.
గెస్ట్ అప్పీరియన్స్ లో కొంత ప్రభావాన్ని చూపించాయి. ఇక్కడ అమ్మడికి బ్యాడ్ లక్ అనేది కూడా వెంటాడుతున్నది మరో అంశం. తొలి హిట్ తో స్టార్ హీరోయిన్లగా మారిన భామలెంతోమంది ఉన్నారు. త్రిష నుంచి సమంత వరకూ నేటి జనరేషన్ చూసుకుంటే కృతిశెట్టి లాంటి భామ తొలి విజయంతోనే ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోగలిగారు.
ఆ వరుసలో షాలిని పాండే…పాయల్ రాజ్ పుత్ లాంటి భామలు నిలువ లేకపోయారు. `ఆర్ ఎక్స్ -100` సక్సెస్ తర్వాత పాయల్ కూడా పెద్ద హీరోయిన్ అవుతుందని భావించారు. అందం..అభినయం.. ఒడ్డు పొడవు అమెని శిఖరాగ్రాన నిలబెడతాయని నిపుణులు అంచనా వేసారు. కానీ ఆ భామ సక్సెస్ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించలేకపోయింది.
తొలి సక్సెస్ కేవలం అవకాశాలకే పునాది వేసింది తప్ప రేసులో రాణించలేకపోయింది. స్ర్కిప్ట్ లు ఎంపిక చేసుకోవడంలో వైఫ్యలమే అన్న కారణం తెరపైకి వస్తుంది. అలాంటి వాటిని ఓవర్ కమ్ చేస్తే తప్ప! కెరీర్ బండి గాడిలో పడదు. ప్రస్తుతం ఇద్దరి పెద్దగా అవకాశాలు లేవు. అందివచ్చిన ఛాన్సెస్ తో సక్సెస్ కొడితే తప్ప ట్రాక్ లో పడటం కష్టమనే విమర్శ వినిపిస్తుంది.