సార్‌గారి ఊపు తగ్గేటట్టు లేదు

శర్వానంద్‌ జోరు ఇప్పట్లో తగ్గేటట్టు లేదు. ‘శతమానం భవతి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని దక్కించుకుని హీరోగా రేంజ్‌ పెంచుకున్న శర్వానంద్‌ కొత్త సినిమా ‘రాధ’ అప్పుడే రిలీజ్‌కి రెడీ అవుతోంది. తొలిసారిగా పోలీస్‌ గెటప్‌ వేసిన శర్వానంద్‌ ఇందులో అల్లరి పోలీస్‌గా కనిపించబోతున్నాడు.

కెరియర్లో ఎక్కువగా మూడీగా వుండే పాత్రలే చేసిన శర్వానంద్‌ ‘రన్‌ రాజా రన్‌’ చిత్రంలో తొలిసారిగా కామెడీ టచ్‌ వున్న క్యారెక్టర్‌ చేసాడు. మళ్లీ రాధలో శర్వానంద్‌ని అలాంటి సరదా పాత్రలో చూడబోతున్నాం. చంద్రమోహన్‌ అనే కొత్త దర్శకుడు తెరెకెక్కిస్తోన్న ఈ టీజర్‌ చూస్తే సినిమాపై పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ రావడం ఖాయం. శర్వానంద్‌ సరదా చిన్నెలతో పాటు లావణ్య వన్నెల విందు కూడా బాగానే వుంటుందని ఈ టీజర్‌ హింట్‌ ఇచ్చేసింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే ఇంప్రెస్‌ చేసిన రాధ ఇప్పుడు టీజర్‌తో ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేసింది.

రన్‌ రాజా రన్‌ నుంచి ఆపకుండా హిట్లు కొడుతోన్న శర్వానంద్‌ ఊపుని రాధ కూడా కంటిన్యూ చేసేలానే వుంది. పబ్లిక్‌కి నచ్చిన హీరో సరదా పాత్ర చేస్తే ఏ రేంజ్‌కి వెళుతుందనేది ‘నేను లోకల్‌’ రుజువు చేసింది. ఈ సినిమాతో శర్వానంద్‌ కూడా అంతటి విజయాన్ని అందుకుంటే, శతమానం భవతిని దిల్‌ రాజు విజయంగా పేర్కొనే వారికి గూబ పగిలేటట్టు ఆన్సర్‌ ఇచ్చినట్టవుతుంది.