శ్రియ-ఆడ్రూల రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ భార్యభర్తలే అయినా ప్రయివేటు కార్యక్రమాల్ని సైతం పబ్లిక్ గానే చేసేయడం ఈ జంట ప్రత్యేకత. నలుగిరిలో పెదవి ముద్దులు…ముంబై వీధుల్లోనే రొమాంటిక్ ఎలివేషన్స్ ఇవ్వడం వంటివి ఈ జంటకు సర్వసాధరణం.
ఇక శ్రియ కి హబ్బీ అంటే ఎంత ప్రేమో పబ్లిక్ గా చాలాసార్లు మాటలకి బధులుగా చేతలతోనే నిరూపించింది. ఓ ఫంక్షన్ లో ఆండ్రూ శ్రియ బుగ్గపై ముద్దాడితే…శ్రియ మాత్రం ఏకంగా భర్త పెదాల్నే అందుకుంది. వీటిపై నెట్టింట నెగివిటీ వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడం ఈ జంటకు అలవాటైన పని.
ఇప్పటివరకూ ఇద్దరు ఎంతో సన్నహితంగా మెలిగిన ఫోటోలు చాలాసార్లు బయటకు వచ్చాయి. తాజాగా మరో కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టా వేదికగా ఈ జంట అభిమానుల కోసం షేర్ చేసింది. అందులో శ్రియ భర్త ఎదపై పరవశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆండ్రూ కౌగిలిలో శ్రియ సేద తీరుతోంది.
ఆ సమయంలో ఆండ్రూ ఇలా సెల్ఫీ తీసి అభిమానులకు శ్రియా ఇన్ స్టా ఖతా ద్వారా షేర్ చేసారు. ఇందులో ఆండ్రూ వైట్ టీషర్ట్ ధరించగా..శ్రియ క్యాజువల్స్ ధరించినట్లు కనిపిస్తోంది. ఇంట్లోనే ఇలా ఖాళీ సమయంలో సోఫాలో కూర్చుని ఇలా మోబైల్ కెమెరాని క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అభిమానులు క్యూట్ ఫెయిర్..బ్యూటీఫుల్ కపుల్ప్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే ..టాలీవుడ్‌ని ఒకప్పుడు ఊపేసిన భామ ఇప్పుడు కూడా క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అవకాశాలు అందుకుంటుంది. రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` లో నటించింది. ఇందులో శ్రియ పాత్ర కీలకమైనదిగా తెలుస్తోంది. త్వరలోనే చిత్రం రిలీజ్ కానుంది.
అలాగే `గమనం` అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. ఇంకా కోలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తోంది. పెళ్లైనా ఇంత విరివిగా అవకాశాలు అందుకోవడం కూడా శ్రియకే చెల్లింది.
చాలా మంది భామలు పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైతే..శ్రియ మాత్రం లైప్ ని మరింత కలర్ ఫుల్ గా మలుచుకుంటోంది. ప్రోఫెషన్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ ని చక్కగా డిజైన్ చేసుకుని ముందుకు వెళ్తోంది. ఆ రకంగా చూస్తే శ్రియ పెళ్లైన హీరోయిన్లు అందరికంటే ప్రత్యేకమనే చెప్పాలి.
యాక్టింగ్ ని..మ్యారీడ్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలంటే భర్త సహకారం ఎంతో ఉండాలి. ఆ రకంగా ఆండ్రూ అన్ని రకాలుగా శ్రియకి మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు.