టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలు.. కెరీర్ లో నిలిచి పోయే పాత్ర అవుతుందని అనుకుంటారు. నిజమే జక్కన్న సినిమాలో నటిస్తే ఖచ్చితంగా కెరీర్ లో ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు. కాని నటుడిగా.. నటిగా ఒక సంతృప్తి అనేది కొద్ది మందికి మాత్రమే జక్కన్న సినిమాల్లో నటించిన వారికి కలుగుతుంది. సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కనుక కొన్ని పాత్రలు ఉన్నాయా లేవా అన్నట్లుగానే ఉంటాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమా లో శ్రియ పాత్ర కూడా ఉందా.. లేదా అన్నట్లుగానే ఉంది. ఆమె కనిపించింది చాలా కొద్ది సమయం మాత్రమే. అది కూడా చాలా సింపుల్ గా చనిపోయంది. బ్రిటీష్ వారి తూటాలకు నేల కూలినట్లుగా ఆమె పాత్రను చూపించారు. ట్రైలర్ లోనే శ్రియ ని అజయ్ దేవగన్ భార్యగా చూపించబోతున్నట్లుగా తెలియజేశారు. కనుక కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని ప్రతి ఒక్కరు భావించారు.
కాని మరీ దారుణంగా శ్రియ స్క్రీన్ స్పేస్ ఉందంటూ ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నాలుగు నిమిషాలకు మించి ఆమె లేకపోవడంతో కాస్త నిరుత్సాహం కలిగించే విషయం. సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా మంచి ఆదరణ దక్కించుకుని.. హీరోయిన్ గా ఇప్పటికి కూడా ఆమె తన సత్తా చాటుతూ నటిస్తూ వస్తుంది. బిడ్డకు తల్లి అయినా కూడా ఇంకా ఆమె నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
శ్రియకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. ఆమె అభిమానులు సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ట్రైలర్ లోనే ఆమె షాట్ ఉంది.. అలాగే డైలాగ్ కూడా ఉండటంతో ఖచ్చితంగా సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర అయ్యి ఉంటుంది.. అంతే కాకుండా స్క్రీన్ స్పేస్ గౌరవ ప్రథంగా ఉండి ఉంటుందని అంతా భావించారు. కాని వారందరికీ కూడా షాక్ ఇస్తూ ఈ సినిమాలోని శ్రియ పాత్రను జక్కన్న చూపించాడు.
లుక్ పరంగా ఆకట్టుకున్న శ్రియ పాత్ర అసలు ఈ సినిమాలో ఉన్నట్లా.. లేనట్లా అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇంతోటి దానికి ఈ సినిమాలో శ్రియా ఉందంటూ ప్రచారం చేయాలా అని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆమెను ఎంపిక చేయడం జరిగింది.
సినిమా లో ఆమె పాత్ర నిడివి తక్కువ ఉన్నా కూడా అత్యంత కీలకమైన ఎపిసోడ్ లో ఆమె ఉండటం గొప్ప విషయం. కనుక ఆర్ ఆర్ ఆర్ లో శ్రియ ఖచ్చితంగా ఉంది.. ఇది ఆమెకు గౌరవాన్ని పెంచే పాత్ర అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.