మెగాస్టార్ సరసన శృతి హాసన్?

ఒకసారి సీనియర్ హీరో పక్కన నటించడానికి హీరోయిన్ ఎస్ చెప్పాక ఇక అందరు సీనియర్ హీరోల సినిమాల్లో నటింపజేయాలని చూస్తారు. ప్రస్తుతం శృతి హాసన్ విషయంలో అదే జరుగుతోంది. క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన శృతికి మళ్ళీ అవకాశాలు పెరుగుతున్నాయి.

రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ లో హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా శృతి హాసన్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంలో హీరోయిన్ గా శృతిని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి వాల్తెయిర్ వీరయ్య అనే టైటిల్ ను అనుకుంటున్నారు. శృతి హాసన్ ఇంకా ఈ ప్రాజెక్ట్ సైన్ చేయలేదు కానీ ఆసక్తిగానే ఉందిట.