అవును.. ఈ విషయం చాలామందికి తెలుసు. కెరీర్ స్టార్టింగ్ లోనే శృతిహాసన్ తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. దీనిపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. తను అప్పట్లో ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో వివరించింది శృతిహాసన్.
“నా మొదటి సినిమా టైమ్ లోనే నా ముక్కు విరిగింది. అది చూడ్డానికి అంత బాగుండేది కాదు. దానిపై నేను చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నాను. నా ఫేస్ చాలా వెస్ట్రన్ గా ఉందని, చాలా షార్ప్ గా ఉందని, నా ముక్కు వల్ల నేను మగాడిలా కనిపించేదాన్నని.. ఇలా చాలా కామెంట్స్ పడ్డాయి. అప్పట్లో నేను ఒత్తిడిలో ఉండేదాన్ని. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. అది నా సొంత నిర్ణయం.”
తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఎప్పుడూ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదంటోంది శృతిహాసన్. చాన్నాళ్ల కిందటే ఈ విషయాన్ని తను స్వయంగా ప్రకటించానని, ఇప్పుడు మరోసారి బాడీషేమింగ్, బాలీవుడ్ లో బ్యూటీ స్టాండర్డ్స్ పై చర్చ నడుస్తోంది కాబట్టి బయటపెట్టానని అంటోంది.
“నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదని ఎవరైనా అంటే అది పెద్ద అబద్ధం. ఎందుకంటే మనుషుల ముఖాలు అంత త్వరగా మారిపోవు. అయితే నా దృష్టిలో ఇది ఏమంత పెద్ద విషయం కాదు. జుట్టుకు కలర్ వేసుకోవడం, కళ్లకు బ్లూ కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవడం, చర్మానికి బ్లీచింగ్ ఎలాంటిదో.. ఇది కూడా అలాంటిదే అని నా ఉద్దేశం. తన బాడీకి సంబంధించి ప్రతి మహిళకు నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది.”
సినిమా ఇండస్ట్రీలో ఉన్నందువల్ల తనలాంటి వాళ్లపై ఎక్కువమంది దృష్టి పడుతోందని, అంతేతప్ప ఇందులో పెద్ద తప్పు లేదంటోంది. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని గౌరవిస్తే మంచిదని చెబుతోంది శృతిహాసన్.