నా పేరు చెబుతున్న ఆ వ్యక్తిని నమ్మకండి : సునీత

ఈమద్య కాలంలో సెలబ్రెటీల పేర్లు చెప్పి అమాయకులను మోసం చేశారు అంటూ వస్తున్న వార్తలు చాలా కామన్‌ గా చూస్తూనే ఉన్నాం. కొందరు సెలబ్రెటీల పేరుతో సోషల్‌ మీడియాలో అకౌంట్స్‌ ఓపెన్‌ చేసి అమాయకులను ట్రాప్‌ చేసి డబ్బులు వసూళ్లు చేయడం లైంగికంగా వాడుకోవడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ గాయని సునీత పేరు చెప్పి ఒక వ్యక్తి కొందరిని మోసం చేస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా సునీత ఫేస్‌ బుక్‌ లైవ్‌ లోకి వచ్చి మరీ చెప్పింది.

చైతన్య అనే వ్యక్తి తన మేనల్లుడిగా పరిచయం చేసుకుని సెలబ్రెటీలతో పరిచయం పెంచుకుంటున్నాడట. కొందరి వద్ద డబ్బులు తీసుకోవడంతో పాటు కొందరికి అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్నాడట. ఈ విషయం నాకు తెలిసి షాక్‌ అయ్యాను. నాకు చైతన్య అనే మేనల్లుడు లేడు. ఈ విషయంలో ఎవరు ఇకపై మోసపోవద్దు అనే ఉద్దేశ్యంతో మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాను అంటూ సునీత ఈ వీడియోను విడుదల చేసింది.

ప్రతి రోజు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎలా సెలబ్రెటీ బంధువులము అంటూ చెప్పగానే డబ్బులు ఇస్తారంటూ అమాయకులను ప్రశ్నించింది. ఒక సెలబ్రెటీ బందువు అనగానే ఎందుకు వారికి డబ్బు ఇవ్వాలి. ఈ విషయంలో కనీసం ఆలోచన చేయరా అంటూ సునీత ప్రశ్నించింది. నా పేరు మాత్రమే కాదు ఇతర సెలబ్రెటీల పేరు చెప్పినా కూడా బయటి వ్యక్తులకు డబ్బు ఇవ్వొద్దంటూ జనాలకు సునీత విజ్ఞప్తి చేసింది. ఇప్పటి వరకు ఆ చైతన్య ఎవరు అనే విషయం నాకు తెలియదని సునీత అన్నారు. పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసే ఉద్దేశ్యంతో సునీత ఉన్నట్లుగా తెలుస్తోంది.
blob:https://www.facebook.com/bb0fac7b-1b07-44cf-9aa1-911b83dfbd8d