ఇన్ సైడ్ న్యూస్: చిరుకు ఓకే చెప్పి బాలయ్యకు నో చెప్పిందట

టాలీవుడ్‌ సీనియర్ హీరోలకు హీరోయిన్స్ సమస్య తప్పడం లేదు. ఏ సినిమా మొదలు పెట్టినా కూడా హీరోయిన్‌ విషయంలో వెదుకులాట తప్పడం లేదు. కొత్త అమ్మాయిలను తీసుకుంటే చాలా వయసు తేడా ఉంటుంది. సీనియర్‌ హీరోయిన్స్ మాత్రం వారితో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. తాజాగా బాలయ్య గోపీచంద్ ల కాంబో సినిమా కోసం పలువురు హీరోయిన్స్ ను సంప్రదించగా నో చెప్పారట. శృతి హాసన్‌ తో పాటు కొందరు హీరోయిన్స్‌ కూడా బాలయ్యతో నటించేందుకు నిరాకరించారు అని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాను బాలయ్య కోసం గోపీచంద్‌ మలినేని అడిగాడట. కాని ఆమె మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పిందట. సినిమా ను చేయను అంటూ చెప్పి బాలయ్య ను తిరష్కరించిందట. కాని అదే సోనాక్షి సిన్హా ఇటీవల బాబీ సంప్రదించగా చిరంజీవికి జోడీగా నటించేందుకు ఓకే చెప్పిందట. చిరంజీవితో సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా కూడా ఆమె చెబుతుందట. బాలయ్య కు నో చెప్పి చిరంజీవి కి ఓకే చెప్పడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.