ఎఫ్‌3 కోసం బాలయ్య బ్యూటీ దిగబోతుందా?

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ లు హీరోలుగా తమన్నా మెహ్రీన్‌ లు హీరోయిన్స్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఎఫ్‌ 3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఎఫ్ 2 ను మించి ఎంటర్ టైన్‌మెంట్‌ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంఉటన్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాను మరింత స్టార్‌ కాస్టింగ్‌ తో తీర్చి దిద్దుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్రను సోనాల్‌ చౌహాన్ తో చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.

బాలకృష్ణ తో రెండు సినిమాల్లో నటించిన సోనాల్‌ యంగ్ హీరో రామ్ తో పండుగ చేస్కో సినిమాను చేసింది. బాలీవుడ్‌ లో అడపా దడపా హాట్‌ పాత్రలు చేస్తూ ఉన్న ఈ అమ్మడు తాజాగా ఎఫ్‌ 3 కోసం ఎంపిక అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ శివారులో జరుగుతోంది. త్వరలోనే సోనాల్‌ చౌహాన్‌ షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.