నటుడు సోను సూద్ రియల్ హీరో అనిపించుకున్న విషయం తెల్సిందే. గతేడాది కరోనా సమయంలో సోను సూద్ చేసిన సేవలను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తిరిగి సినిమాలతో బిజీగా మారిన సోను సూద్ సెట్ లోదోశ పాఠాలు చెబుతున్నాడు.
సినిమా షూటింగ్ లో ఉన్న సోను సూద్ దోశ వేస్తూ రెండు నిమిషాల వీడియోను రూపొందించి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసాడు. అందులో భాగంగా నటులు కావాలనుకున్న వారు దోశలు కూడా వేయడం నేర్చుకుంటే చాలా మంచిదని సెలవిచ్చాడు.
అంతే కాకుండా చాలా గుండ్రంగా క్షణాల్లో అద్భుతమైన దోశను వేసి చూపించాడు. ఈ దోశతో కొబ్బరి చట్నీ, కారప్పొడి ఉంటే అద్భుతంగా ఉంటుందని కూడా తెలిపాడు. కష్టపడి సంపాదించుకో, సంతోషంగా తిను అని సోను సూద్ పిలుపునిచ్చాడు.