ఆక్సీజన్‌ కోరిన రైనా.. అందించిన సోనూసూద్‌

కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆక్సీజన్‌ కొరత ఏర్పడింది. దేశంలో ఆక్సీజన్‌ కొరత కారణంగా పెద్ద ఎత్తున జనాలు మృతి చెందుతున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సోనూసూద్‌ తనవంతు సాయం అన్నట్లుగా ఆక్సీజన్‌ సిలిండర్లను మరియు మెడిసిన్స్ ఇంకా ఆసుపత్రి బెడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆక్సీజన్‌ కొరత తో ప్రభుత్వాలు కూడా చేతులు ఎత్తేసిన సమయంలో సోనూసూద్‌ ముందుకు వచ్చాడు. ఎంతో మందికి ఆక్సీజన్‌ ను అందించాడు.

కరోనా తో బాధ పడుతున్న రైనా ఆంటీ కి మీరట్ లో ఆక్సీజన్‌ అవసరం అంటూ రైరా ట్వీట్ చేశాడు. సీఎం యోగి ఆధిత్యనాథ్ ను ట్యాగ్ చేసి ట్వీట్‌ చేసిన రైనాకు వెంటనే సోనూసూద్ నుండి సాయం అందింది. సోనూసూద్‌ స్పందించి తాను సాయం చేస్తా డిటైల్స్ ఇవ్వండి అన్నాడు. ఆ తర్వాత పది నిమిషాల్లో ఆక్సీజన్‌ సిలిండర్‌ అక్కడకు వెళ్లిందంటూ సోనూసూద్‌ ట్వీట్ చేశాడు. మొత్తానికి రైనా వంటి స్టార్ కు కూడా సోనూసూద్‌ సాయం గా నిలవడం అభినందనీయం. సోనూసూద్‌ ఎంతగా ప్రస్తుతం కరోనా సమయంలో సాయంగా నిలుస్తున్నాడో ఈ సంఘటన మరో నిదర్శనం.