ప్రముఖ ఇండియన్ సినీ దగ్గజం.. దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత సౌమిత్ర చటర్జీ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం అత్యంత క్రిటికల్ కండీషన్లో ఉన్నారు అంటూ ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్న వైధ్యులు చెబుతున్నారు. కృత్రిమ శ్వాసను అందించడంతో పాటు ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన స్పృహలో లేరని వైధ్యులు పేర్కొన్నారు.
ఆయన రక్త కణాలు గణనీయంగా పడిపోవడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం భారీగా తగ్గింది. శరీరంలోని యూరియా మరియు సోడియం స్థాయి బాగా పెరిగింది. గుండె మరియు ఊపిరితిత్తులు సరిగానే ఉన్నా కూడా బ్రెయిన్ కు సంబంధించి సమస్య ఉందని వైధ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఆరోగ్యం విషయంలో అత్యున్నత స్తాయి వైధ్యులు పరీక్షలు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల నుండి అనుమతి లభిస్తే ట్రీట్మెంట్ను అందిస్తామని అన్నారు. వయన వయసు రీత్యా కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా ఎటాక్ అవ్వడంతో ఆయన పరిస్థితి సీరియస్ అయ్యింది.