శ్రీకారం: హిట్స్ లో లేకపోయినా టికెట్ హైక్స్ ఎక్కడా తగ్గట్లేదు!

శర్వానంద్ కు గత కొంత కాలం నుండి సరైన హిట్ అన్నదే లేదు. శతమానం భవతి, మహానుభావుడు వంటి సూపర్ హిట్స్ తర్వాత శర్వానంద్ నుండి సరైన విజయమే రాలేదు. మార్కెట్ కూడా డౌన్ అయింది. అయినా కానీ శర్వానంద్ రీసెంట్ సినిమా శ్రీకారంకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ అయింది.

రైతుల సమస్యల నేపథ్యంలో తీసిన సీరియస్ సినిమా శ్రీకారంకు నైజాం ప్రాంతంలో 5.7 కోట్ల బిజినెస్ అయింది. అలాగే సీడెడ్ లో 2.4 కోట్ల బిజినెస్ చేసింది శ్రీకారం. ఇక ఆంధ్ర ప్రాంత హక్కులు మొత్తం కలిపి 8 కోట్లకు అమ్ముడుపోయింది. సో, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి శ్రీకారం 16.1 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఈ సినిమా.

వరల్డ్ వైడ్ బిజినెస్ కూడా కన్సిడర్ చేసుకుంటే శ్రీకారం చిత్రం 17.1 కోట్ల రూపాయల బిజినెస్ ను పూర్తి చేసింది. ఈ చిత్రం హిట్ అనిపించుకోవాలంటే 17.5 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. ఇక శ్రీకారం చిత్రానికి టికెట్ హైక్స్ కూడా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయల దాకా, మల్టీప్లెక్స్ లలో 250 రూపాయల దాకా పెంచుకునే సౌలభ్యం ఉంది.