నిత్యం వివాదాలతో సహవాసం చేసే శ్రీరెడ్డి, ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. గతంలో చాలా మందిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి ఈసారి పెద్ద కారణం లేకుండానే మంచు లక్ష్మిని టార్గెట్ చేసింది.
సరైన కారణం తెలీదు కానీ శ్రీరెడ్డి మంచు లక్ష్మితో పాటు లక్ష్మి భర్త, కూతురిని కూడా ట్రోల్ చేసింది. కొంత అసభ్యకరమైన పదజాలం వాడుతూ చేసిన ఆ 11 నిమిషాల ట్రోల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.
అయితే ఆమె ఎందుకిలా చేసింది అన్నది మాత్రం తెలియరాలేదు. మంచు లక్ష్మి స్పూఫ్ అంటూ పోస్ట్ చేసిన ఆ వీడియోలో కొన్ని దారుణమైన ట్రోల్స్ ఉన్నాయి. మరి కారణం లేకుండా మంచు లక్ష్మిని ఎందుకు ట్రోల్ చేసిందో మన వివాదాల రాణి.