తెలుగు బుల్లితెర మీద స్టార్ యాంకర్లలో ఒకరిగా కొనసాగిన శ్రీముఖి, ఇప్పుడు సినిమాల్లో బిజీ అవ్వాలని బాగా ట్రై చేస్తోంది.. ‘జబర్దస్త్’ యాంకర్లు అనసూయ, రష్మిల మాదిరిగానే శ్రీముఖి, పొట్టిపొట్టి దుస్తుల్లో గ్లామర్‌ను చూపించడానికి ఏ మాత్రం మొహమాటపడదు. అయితే చాలామంది సెలబ్రిటీలాగే ఈ పాప చెప్పేదానికి, చేసేదానికి అస్సలు పొంతన ఉండదు.
కొన్నిరోజుల కిందట ఓ టీవీషోలో పాల్గొన్న శ్రీముఖి… ‘జులాయి’ తర్వాత పెద్ద సినిమాల్లో ఎందుకు నటించలేదనే ప్రశ్నకు సమాధానంగా ‘అవకాశాలు వచ్చాయి కానీ ఎక్స్పోజింగ్ చేయాలి, ముద్దు సీన్లలో నటించాలి’ అని అడిగారని… దానికి ససేమీరా అనడంతో ఛాన్స్‌లు పోయాయని చెప్పింది.
నిజానికి శ్రీముఖి సోషల్ మీడియా పేజీలను గమినించినవారికి ఈ మాటల్లో నిజమెంతో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లింగరీలో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, తాను దేనికైనా రెఢీ అనే సంకేతాలు ఇస్తోంది శ్రీముఖి. ఎద అందాలు, తొడ అందాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తోంది. అవకాశాలు వచ్చినప్పుడు ‘ఎక్స్‌ఫోజింగ్‌కు నో’ చెప్పి, ఇప్పుడిలా ఎందుకు చేస్తోందని చాలా మంది డౌట్ పడుతున్నారు.
నిజంగా ఛాన్స్‌లు వచ్చాయా? అమ్మడు అలా చెప్పిందా? అయినా సినిమా అవకాశాలు వచ్చినప్పుడే అందుకోవాలి. అడిగినప్పుడు కాస్త గ్లామరస్ గా కనిపించాలి. అప్పుడు అవకాశాలు వదిలేసి, ఇప్పుడు చూపిస్తానంటూ బటన్స్ వదిలేసినా లింగరీలో కనిపించి హడావుడి చేసినా పిలిచి ఛాన్స్‌లు ఇచ్చేవారు ఉండరు అంటున్నారు సినీ జనాలు. చాలామంది హీరోయిన్ల విషయంలో ఇది నిజమైంది కూడా!